క్రికెట్లో టెస్టు ఫార్మాట్ ఎంతో ఉత్తమమైందని అంటున్నాడు వెస్డిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్. ఈ ఫార్మాట్లో ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయని వెల్లడించాడు. తాజాగా బీసీసీఐ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో ముచ్చటించిన గేల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
"క్రికెట్లో టెస్టు ఫార్మాట్ చాలా గొప్పది. ఇందులో రాణించడం వల్ల మీకు అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే అది ఛాలెంజింగ్ ఫార్మాట్. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఉండాలనే విషయాన్ని టెస్టు క్రికెట్ బోధిస్తుంది. మీకున్న ప్రతిభను, మానసిక దృఢత్వాన్ని ఇది పరీక్షిస్తుంది. అందువల్ల టెస్టు క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన చేస్తూ ఆటను పూర్తిగా ఆస్వాదించండి. క్రికెట్లోనే కాకుండా మనలోని ప్రతిభను బయటపెట్టడానికి ఏదో ఒక దారి ఉంటుంది. ఒకవేళ అలా లేని పక్షంలో మరో అవకాశం మీకై కచ్చితంగా ఉంటుంది. అందువల్ల క్రికెటర్లు లేని వాటికోసం ఎదురుచూడకుండా ఉన్న అవకాశాల్లో ప్రతిభ చూపండి".