పాకిస్థాన్లో సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా టీ 20 కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్లో సిరీస్ ఆడేందుకు సముఖత వ్యక్తం చేయలేదు. ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో మ్యాథ్యూస్, తిసారా పెరీరా ఉన్నారు.
సెప్టెంబర్ 27 నుంచి పాకిస్థాన్లో ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది శ్రీలంక. అక్టోబర్ 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో ఇందులో మూడు వన్డేలు, మూడు టీ 20లు ఉన్నాయి.