రాబోయే విజయ్ హజారే ట్రోఫీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో యువ పేసర్ నటరాజన్‌కు చోటు కల్పించింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ). భారత సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌ను సారథిగా నియమించగా.. బాబా అపరాజిత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది.
ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే తొలి రెండు టెస్టుల భారత జట్టులో ఈ యువ లెఫ్టార్మ్ పేసర్‌కు స్థానం కల్పించలేదు యాజమాన్యం. దీంతో తమిళనాడు జట్టులో చోటు కల్పించినట్లు టీఎన్‌సీఏ తెలిపింది. అతడిని ఆడించే విషయంపై బీసీసీఐ అనుమతి కోరినట్లు పేర్కొంది. ఇంగ్లాండ్‌తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఈ ట్రోఫీ నటరాజన్‌కు ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించింది.