తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​లో కొత్త ఆటగాళ్లు.. టైటిల్ కైవసంపై జట్టు ఆశలు - vivo ipl 2019

కొత్త ఆటగాళ్ల రాకతో జట్టు పటిష్ఠంగా ఉందని..ఈ సారి కప్పు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు  హైదరాబాద్​ సన్​రైజర్స్​ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. నూతన  జెర్సీలను  టీం సభ్యులకు అందజేశారు.

సన్​రైజర్స్​లో కొత్త ఆటగాళ్లు..జెర్సీలతో స్వాగతం

By

Published : Mar 21, 2019, 7:42 AM IST

సన్​రైజర్స్​ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం
ఐపీఎల్ ...మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. హాట్ ఫేవరెట్లలో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్​... ఈ సీజన్​లో నలుగురు కొత్త ఆటగాళ్ళతో బరిలోకి దిగుతోంది. వీరి రాకతో జట్టు పటిష్ఠంగా తయారైందని జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈనెల 24న ఈడెన్ గార్డెన్స్​లో కోల్​కతా నైట్ రైడర్స్​తో తలపడనుంది సన్​రైజర్స్​.
  • హైదరాబాద్​ జట్టులో పెద్ద ఆటగాళ్లు తక్కువగా ఉన్నా మంచి ప్రదర్శనతో బలమైన జట్లకు పోటీ ఇస్తోంది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచినా గెలిచే బౌలింగ్​ ప్రతిభ ఈ జట్టుకే సొంతం. అలాంటి టీంలోకి మరో నలుగురు కొత్త క్రీడాకారులు వచ్చారు.

వీళ్లకు సాదర స్వాగతం పలికిన యాజమాన్యం...ఆటగాళ్లకు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసింది. జట్టు సభ్యులకు జెర్సీలను అందజేసింది. వేడుకలో లక్ష్మణ్, జట్టు కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ మురళీధరన్ పాల్గొన్నారు.

  • యువ ఆటగాళ్ళకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని లక్ష్మణ్ చెప్పారు. కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా కొనసాగుతాడని తెలిపారు. పొరపాట్లను సరిచేసుకుని టైటిల్ ను సొంత చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు వీవీఎస్​.

వార్నర్ నేతృత్వంలో 2016లో తొలిసారిగా ఐపీఎల్ గెలిచింది సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు. విలియమ్సన్ సారథ్యంలో ఈసారి ఎలాగైనా కప్పుకొట్టాలని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details