సిడ్నీ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ సెంచరీతో అలరించాడు. దీంతో టెస్టు క్రికెట్లో భారత జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమ్ఇండియాతో 25 ఇన్నింగ్స్‌లలో ఆడిన స్మిత్.. 8 సెంచరీలు చేశాడు.
టీమ్ఇండియాపై 8 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియన్ ఆటగాళ్ల జాబితాలో గ్యారీ సోబెర్స్ (30 ఇన్నింగ్స్) , వివియాన్ రిచర్డ్స్ (41 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (51 ఇన్నింగ్స్) ఉన్నారు.