తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​లో ఆడనందుకు బాధపడటం లేదు'

యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​లో తాను ఆడనందుకు చింతించడం లేదని అన్నాడు ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్​ స్టార్క్​. ఈ సమయాన్ని టీ20 ప్రపంచకప్​పై దృషి కేంద్రీకరించేందుకు కేటాయిస్తానని తెలిపాడు.

Starc does not regret missing IPL
మిచెల్​

By

Published : Aug 4, 2020, 4:58 PM IST

Updated : Aug 4, 2020, 5:15 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో పాల్గొనలేకపోతున్నందుకు ఎటువంటి బాధ లేదని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్​ మిచెల్​ స్టార్క్​ తెలిపాడు. వచ్చే వేసవి సీజన్​కు ప్రస్తుతం అన్ని విధాలుగా సంసిద్ధం అవుతున్నట్లు వివరించాడు. ఇటీవలే కరోనా కారణంగా వాయిదా పడిన టీ20 ప్రపంచకప్​పై దృష్టి కేంద్రీకరించేందుకు స్టార్క్​ ఈ లీగ్​ నుంచి తప్పుకున్నాడు.

ఐపీఎల్​

"నాకు తెలుసు. ఐపీఎల్​ ఎంతో అద్భుతమైంది,. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోను. ఓ వైపు సెప్టెంబరులో ఐపీఎల్ జరుగుతుంటే.. ఆ సమయాన్ని శిక్షణకు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉంది. వచ్చే ఏడాదిలో జరిగే లీగ్​లో ప్రజలు నన్ను కోరుకుంటే.. కచ్చితంగా ఆ విషయం గురించి ఆలోచిస్తా. కానీ, ఇప్పుడు మాత్రం నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు."

-మిచెల్​ స్టార్క్​, ఆస్ట్రేలియా బౌలర్​

2018 ఐపీఎల్​ వేలంలో మిచెల్​ను కోల్​కతా నైట్​ రైడర్స్​ కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా ఈ సీజన్​ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఎన్​ఎస్​డబ్ల్యూ స్టేట్​ జట్టుతో శిక్షణ పొందుతున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​పై కూడా స్పందించాడు మిచెల్​. "ఆటగాళ్లందరూ మ్యాచ్​ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మేము ఇంగ్లాండ్​కు వెళ్తామా లేదా అనే విషయం ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు, ప్రభుత్వం కలిసి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. క్రికెటర్లంతా ఈ సిరీస్​ కోసం వేచి చేస్తున్నారు" అని స్టార్క్​ పేర్కొన్నాడు.

మిచెల్​

మూడు టీ20, వన్డేలతో కూడిన ఈ సిరీస్​ సెప్టెంబరు 4న ప్రారంభం కానుంది. అయితే ఇందుకు అనుమతి ఇంకా లభించలేదు.

Last Updated : Aug 4, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details