శ్రీలంక సీనియర్ క్రికెటర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి వన్డే తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని లంక సారథి కరుణరత్నే తెలిపాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జులై 26న ప్రారంభం కానుంది.
ఆ మ్యాచ్ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై - srilanka
బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి వన్డే తర్వాత శ్రీలంక ఆటగాడు మలింగ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు సారథి కరుణరత్నే తెలిపాడు.
మలింగ
ఈ విషయం మలింగ తనకు చెప్పాడని కరుణరత్నే వెల్లడించాడు. 36 ఏళ్ల మలింగ 15 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు దక్కించుకున్నాడు. మురళీధరన్ (523), చమిందా వాస్ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్‌గా అతను నిలిచాడు.
ఇవీ చూడండి.. అత్యుత్తమ క్రికెట్ జట్టు సిద్ధం చేస్తున్న ప్రధాని!
Last Updated : Jul 23, 2019, 4:30 PM IST