బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ ఎన్నికైతేకోచ్ రవిశాస్త్రి భవితవ్యం ఏంటని సర్వత్రా చర్చించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అతడిపై ట్రోల్స్ పోటెత్తాయి. అయితే ఇప్పుడు దాదాపై ప్రశంసలు కురిపిస్తున్నాడు రవిశాస్త్రి. భారత్ క్రికెట్ ముందుకు వెళ్తుందనడానికి గంగూలీ నియామకమే సంకేతమని చెప్పాడు.
"బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సౌరభ్ గంగూలీకి శుభాకాంక్షలు. భారత క్రికెట్ ముందుకు వెళ్తుందనడానికి గంగూలీ ఎన్నికే సంకేతం. అతడు సహజమైన నాయకుడు. దాదా లాంటి వ్యక్తి 4, 5 ఏళ్ల క్రితమే బీసీసీఐ అధ్యక్షుడైనట్లయితే భారత క్రికెట్లో మరిన్ని విజయాలు నమోదై ఉండేవి" - రవిశాస్త్రి, టీమిండియా కోచ్.