తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనికి సరైన రీతిలో వీడ్కోలు పలకాలి'

మహేంద్రసింగ్​ ధోని రిటైర్మెంట్​పై భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా మహీని సంప్రదించి, సరైన విధంగా అతడికి వీడ్కోలు పలకాలని తెలిపాడు.

ధోనీ రిటైర్మంట్​పై కుంబ్లే స్పందించిన కుంబ్లే

By

Published : Sep 8, 2019, 11:32 AM IST

Updated : Sep 29, 2019, 8:56 PM IST

ప్రపంచకప్ అనంతరం టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్​ విషయం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు మహీ. తాజాగా టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు.

"మహీ జట్టులో ఉంటాడా లేదా అనేది నేను చెప్పలేను. అయితే, సెలక్టర్లు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అతడిని సంప్రదించటం మంచిది. ఒకవేళ ధోని రిటైర్మెంట్​ ప్రకటిస్తే సరైన విధంగా వీడ్కోలు పలకాలి." -అనిల్ కుంబ్లే, భారత మాజీ కెప్టెన్, కోచ్

సెలక్టర్లు చర్చించుకుని జట్టుకు ఏది ముఖ్యమో నిర్ణయించాలని సూచించాడు కుంబ్లే.

"ధోని స్థానంలో రిషభ్ పంత్​ వికెట్ కీపర్​ బ్యాట్స్​మన్​గా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఆటలో కొన్నిసార్లు తడబడినా.. టీ ట్వంటీల్లో సత్తాచాటుతున్నాడు. సెలక్టర్లు పంత్​కు మద్దతు ఇస్తారా? లేదా ధోనికే అవకాశం ఇస్తారా అనేది రాబోయే రెండు నెలల్లో నిర్ణయించాల్సి ఉంది. జట్టు విషయంలో ఉమ్మడి ప్రణాళికలు అవసరం" -అనిల్ కుంబ్లే, భారత మాజీ కెప్టెన్, కోచ్

ఇటీవలే వెస్టిండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన భారత్ ఈ నెల 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్​ ఆడనుంది. ఈ సిరీస్​కు మహీని ఎంపిక చేయలేదు సెలక్టర్లు.

ఇదీ చూడండి: టీ-20 ప్రపంచకప్​కు బంగ్లాదేశ్, థాయ్​లాండ్​ అర్హత

Last Updated : Sep 29, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details