ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. మ్యాచ్‌లో గాయపడిన స్మిత్ దగ్గరకు వెళ్లి చూడలేదని ఆర్చర్‌పై నిప్పులు చెరిగాడు.
" గేమ్‌లో బౌన్సర్ ఒక భాగం. అయితే దాని వల్ల బ్యాట్స్‌మన్‌కు గాయమై కుప్పకూలితే.. బౌలర్ అతడి వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాలి. నొప్పితో బాధపడుతున్న స్మిత్ దగ్గరకు ఆర్చర్ వెళ్లలేదు. ఇది సరైన పద్ధతి కాదు. నేను అతడి స్థానంలో ఉంటే ముందుగా బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి పరామర్శించేవాడిని".
--షోయబ్ అక్తర్, మాజీ క్రికెటర్