తెలంగాణ

telangana

ETV Bharat / sports

నువ్వు ఆ సిక్స్​తో సచిన్​ను గుర్తుచేశావ్: షోయబ్ అక్తర్ - cricket news

భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో శతకంతో మెరిసిన రోహిత్ శర్శను ప్రశంసలతో ముంచెత్తాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఈ మ్యాచ్​లో టీమిండియా సమష్టిగా రాణించిందని అన్నాడు.

నువ్వు ఆ సిక్స్​తో సచిన్​ను గుర్తుచేశావ్: షోయబ్ అక్తర్
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ

By

Published : Jan 20, 2020, 2:23 PM IST

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​లో గెలిచి, సిరీస్​ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో సెంచరీతో ఆకట్టుకున్నాడు భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ. విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా అతడిపై ప్రశంసలు కురిపించాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. అప్పర్​ కట్​లో కొట్టిన సిక్స్​తో సచిన్​ను తలపించాడని అన్నాడు.

"ఒకసారి రోహిత్ టచ్​లోకి వచ్చాడంటే అతడ్ని ఆపటం కష్టం. బంతి ఏదైనా అతడికి ఒక్కటే. రోహిత్ బ్యాటు నుంచి షాట్లు సులభంగా వస్తాయి. పేస్ బౌలింగ్​లో కొట్టిన అప్పర్​ కట్​తో నువ్వు సచిన్​ను గుర్తుచేశావు. 2003 ప్రపంచకప్​లో సచిన్ నా బౌలింగ్​లో ఇలాంటి సిక్స్​లే కొట్టాడు. దానిని మరోసారి నువ్వు గుర్తుచేశావు" -షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్

ఈ మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. రోహిత్(119)కు తోడు కోహ్లీ(89), శ్రేయస్ అయ్యర్(44) ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా.

సిరీస్ గెల్చిన తర్వాత టీమిండియా

ABOUT THE AUTHOR

...view details