భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్. మహీ గొప్ప ఆటగాడంటూ కితాబిచ్చాడీ మాజీ ఆటగాడు. ప్రపంచకప్‌లో ధోనీ అవసరం భారత జట్టుకుందని అభిప్రాయపడ్డాడు. అతని అనుభవం, నాయకత్వ లక్షణాలు కోహ్లీసేనకు ఉపయోగపడతాయని స్పష్టం చేశాడు.
"కోహ్లీకి ధోనీ అవసరముంది"
ఒత్తిడి సమయంలో ధోనీ అవసరం జట్టుకుందని ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు.
షేన్‌వార్న్
విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడే... కానీ ఒత్తిడి సమయంలో చాలా సార్లు విరాట్‌కు ధోనీ సాయం చేయడం గమనించామని తెలియజేశాడు వార్న్. మ్యాచ్‌లో అంతా సవ్యంగా జరిగితే ఎలాంటి సమస్య ఉండదని, కఠిన పరిస్థితుల్లో మాత్రం ధోనీ లాంటి ఆటగాడి అవసరం కోహ్లీకి ఉందని అభిప్రాయపడ్డాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యమున్న వ్యక్తి ధోనీ, అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదని తెలిపాడు ఈ ఆసీస్ స్పిన్ దిగ్గజం.