తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాప్​-10లో భారత ఆల్​రౌండర్లకు చుక్కెదురు

బంగ్లాదేశ్​ సీనియర్​ క్రికెటర్​ షకీబ్​ అల్​ హసన్​ వన్డే ఆల్​రౌండర్ల ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. తాజాగా ఐసీసీ ఈ జాబితాను విడుదల చేసింది. టాప్​-10లో ఒక్క భారత ఆటగాడికి చోటు లభించలేదు.

టాప్​-10లో భారతీయ ఆల్​రౌండర్లకు చుక్కెదురు

By

Published : May 22, 2019, 7:25 PM IST

ఐసీసీ ప్రకటించిన వన్డే ఆల్​రౌండర్ల జాబితాలో చిన్నదేశాల క్రికెటర్లు టాప్​ స్ఠానాలు సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశ్​ క్రికెటర్​ షకీబ్​ అల్​ హసన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల ఐర్లాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో బంగ్లా ఆటగాడు షకీబ్​ సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శనతో సిరీస్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 140 పరుగులు, 2 వికెట్లు తీశాడీ ఆల్​రౌండర్​.

టాప్​ 20లో మనోళ్లు...

అఫ్గాన్​ ఆటగాడు రషీద్​ ఖాన్​ను రెండో స్థానానికి నెట్టి 359 పాయింట్లతో షకీబ్​ తొలి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 319 పాయింట్లతో మరో అఫ్గాన్​ ఆటగాడు నబీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

పాకిస్థాన్​ క్రీడాకారుడు ఇమాద్​ వసీమ్​(4), న్యూజిలాండ్​ ఆటగాడు మిచెల్​ సాంట్నర్​​(5), ఇంగ్లండ్​ నుంచి క్రిస్​ వోక్స్​ (6), మరో పాక్​ ఆటగాడు హఫీజ్​(7) స్థానాలలో నిలిచారు. ప్రపంచకప్​ ముందు పాకిస్థాన్​ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు టాప్​ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇంగ్లండ్​ ఆటగాడు బెన్​ స్టోక్స్ ​8 పాయింట్ల తేడాతో టాప్​-10లో స్థానం కోల్పోయాడు. భారత ఆటగాడు కేదార్​ జాదవ్​ 12వ ర్యాంక్​లో ఉన్నాడు. అదే స్థానానికి దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండిలే పెహ్లువాయో, ఇంగ్లండ్​ ఆటగాడు మొయిన్​ అలీ పోటీనిస్తున్నారు. టాప్​ 20లో హార్దిక్​ పాండ్య చోటు దక్కించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details