కరోనాతో ఐపీఎల్ నిర్వహణ ఆలస్యమైంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2019 సీజన్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
"ప్రస్తుత పరిస్థితుల మధ్య.. రాజస్థాన్ రాయల్స్ అభిమానులు, క్రీడా ప్రియులను అలరించేందుకు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరిలో ముఖ్యంగా 800 మిలియన్ల ఐపీఎల్ అభిమానుల్లో ఇది ఉత్సాహం నింపుతుందని ఆశిస్తున్నాం."