తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ ​X దక్షిణాఫ్రికా తొలి టీ-20 వర్షార్పణం

ధర్మశాల వేదికగా భారత్​ - దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ-20కి వరణుడు అడ్డుపడ్డాడు. ఈ కారణంగా మ్యాచ్​ను రద్దు చేశాడు రిఫరీ. తర్వాతి మ్యాచ్ మొహాలి వేదికగా ఈ నెల 18న జరుగనుంది.

rain

By

Published : Sep 15, 2019, 8:17 PM IST

Updated : Sep 30, 2019, 6:12 PM IST

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ- ట్వంటీ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయింది. ధర్మశాల స్టేడియం మొత్తం వాన నీరు నిలిచి ఉండడం వల్ల రిఫరీ మ్యాచ్​ రద్దు చేశాడు. కనీసం టాస్ వేసేందుకుకూడా వీలు పడలేదు.

ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచింది సిబ్బంది. మధ్యలో కొంత సేపు వర్షం ఆగినప్పటికీ ఆ తర్వాత వస్తూ, పోతూ ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 18న మొహాలి వేదికగా జరుగనుంది.

వెస్టిండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించింది టీమిండియా. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై నెగ్గి జోరు కొనసాగించాలనుకుంటోంది.

ఇదీ చదవండి: 'నీ మద్దతు​కు ధన్యవాదాలు.. ఐ లవ్ యూ'​

Last Updated : Sep 30, 2019, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details