తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడు వికెట్లు తీస్తే గెలుపు టీమిండియాదే'

మే 30న ప్రారంభం కానుంది ప్రపంచకప్.​ ఈ మెగాటోర్నీలో జరిగే మ్యాచ్​లలో మధ్య ఓవర్లలో వికెట్లు తీసిన జట్లకు విజయావకాశాలు ఎక్కువని చెప్పాడు రాహుల్ ద్రవిడ్. ఈ విషయం టీమిండియాకు బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు.

'అప్పుడు వికెట్లు తీస్తే గెలుపు టీమిండియాదే'

By

Published : May 19, 2019, 10:57 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. ప్రపంచకప్​లో భారత జట్టుకు విజయావకాశాలు ఎక్కువని చెప్పాడు. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్​లలో మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తే పరుగుల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని, తద్వారా విజయాలు సాధించొచ్చని విశ్లేషించాడు.

రాహుల్ ద్రవిడ్

"ఇంతకు ముందు ఇంగ్లాండ్​లో పర్యటించిన నేపథ్యంలో ఈ ప్రపంచకప్​లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాను. టోర్నీలో జరిగే మ్యాచ్​లలో మధ్య ఓవర్లలో వికెట్లు తీసే జట్లకు విజయావకాశాలు ఎక్కువ. టీమిండియా సభ్యులు బుమ్రా, చాహల్, కుల్​దీప్ ఈ అవకాశాన్ని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యర్థి అధిక స్కోరు చేయకుండా ఉండటంలో వీరి పాత్ర ఎంతో కీలకం కానుంది." -రాహుల్ ద్రవిడ్, టీమిండియా మాజీ కెప్టెన్

ప్రపంచకప్​లో భారత్​తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​కు కప్పు గెలిచే అవకాశాలున్నాయని చెప్పాడు ఈ దిగ్గజ క్రికెటర్.

టీమిండియా వన్డే జట్టు

మే 30న ప్రారంభం కానుంది ఈ మెగాటోర్నీ. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా. అంతకు ముందు ఈనెల 25న న్యూజిలాండ్​తో, 28న బంగ్లాదేశ్​తో ప్రాక్టీసు మ్యాచ్​లు ఆడనున్నారు 'మెన్ ఇన్ బ్లూ'.

ABOUT THE AUTHOR

...view details