ధోనీసేన వన్డే ప్రపంచకప్‌ను గెలిచి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2011లో ఇదే రోజు (ఏప్రిల్ 2) భారత్ కప్పును ముద్దాడింది. కపిల్ డెవిల్స్ (1983 ప్రపంచకప్) తర్వాత ప్రపంచ విజేతగా నిలిచిన రెండో భారత జట్టుగా ఘనత సాధించింది.
స్టార్‌స్పోర్ట్స్‌లో మళ్లీ
వాంఖడేలో శ్రీలంకతో రవవత్తరంగా సాగిన ఫైనల్.. అభిమానులను ఉత్కంఠతో ఊపేసి, ఆనంద డోలికల్లో తేలేలా చేసింది. ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఆ చారిత్రక ఘట్టాన్ని మరోసారి వీక్షించడానికి, ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి క్రికెట్ ప్రేమికులకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, గురువారం మళ్లీ ప్రసారం చేయనుంది.
ఇదీ చదవండి:కరోనా కారణంగా క్రీడాకారుల వేతనాల్లో కోత!