నిర్మాతగా గతేడాది తొలి అడుగు వేశాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 'ధోనీ ఎంటర్టైన్మెంట్స్' సారథ్యంలో 'రోర్ ఆఫ్ లయన్' డాక్యుమెంటరీ సిరీస్ తీశాడు. ఇప్పుడు పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ అంశాలున్న వెబ్ సిరీస్ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. నటీనటుల అన్వేషణలో చిత్రబృందం ప్రస్తుతం నిమగ్నమై ఉంది.
కొత్త రచయిత రాసిన, ప్రచురణ కాని ఓ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించనున్నారు. ఇది థ్రిల్లింగ్ అడ్వంచర్గా ఉంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాక్షి సింగ్ ధోనీ చెప్పారు.