తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా దశాబ్ద మేటి కెప్టెన్లుగా ధోనీ, కోహ్లీ - క్రికెట్ ఆస్ట్రేలియా

ఈ దశాబ్దంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది. ఇందులో వన్డే జట్టుకు కెప్టెన్​గా ధోనీని, టెస్టు జట్టుకు కెప్టెన్​గా కోహ్లీని నియమించింది.

MS Dhoni
ధోనీ

By

Published : Dec 24, 2019, 10:48 AM IST

అంతర్జాతీయ క్రికెట్​లో భారత ఆటగాళ్ల హవా నడుస్తోంది. ఈ దశాబ్దంలో మేటి ఆటగాళ్లుగా టాప్​లో నిలిచారు కోహ్లీ, రోహిత్. అయితే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ దశాబ్ద మేటి జట్టులో మన సారథులు చోటు దక్కించుకున్నారు. టెస్టు టీమ్​కు విరాట్ కోహ్లీని, వన్డే టీమ్​కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్​గా నియమించింది ఆసీస్ క్రికెట్ బోర్డు.

"ఈ దశాబ్దంలో వన్డేలో మేటి ఆటగాడిగా ధోని నిలిచాడు. 2011 ప్రపంచకప్​లో మహీ భారత జట్టును ముందుండి నడిపించాడు. గొప్ప ఫినిషర్​గానూ పేరు తెచ్చుకున్నాడు."
-క్రికెట్ ఆస్ట్రేలియా

వన్డే జట్టులో ధోనీతో పాటు రోహిత్, కోహ్లీ చోటు సంపాందించారు. హిట్​మ్యాన్​తో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాను ఓపెనర్​గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా. డివిలియర్స్​కు నాలుగో స్థానం కేటాయించింది. రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న ధోనీ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ప్రపంచకప్​ సెమీఫైనల్ తర్వాత ఇప్పటివరకు ఏ సిరీస్​లోనూ ఆడలేదు మహీ. ఫలితంగా రిటైర్మెంట్​ వార్తలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు మాట్లాడలేదీ ఆటగాడు. ​

క్రికెట్ ఆస్ట్రేలియా దశాబ్ద మేటి వన్డే జట్టు

రోహిత్ శర్మ, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, షకిబుల్ హసన్, జాస్ బట్లర్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, రషీద్ ఖాన్

క్రికెట్ ఆస్ట్రేలియా దశాబ్ద మేటి టెస్టు జట్టు

అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబి డివిలియర్స్, బెన్ స్టోక్స్, డెయిల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లియోన్, జేమ్స్ అండర్సన్

ఇవీ చూడండి.. కోహ్లీ.. మరో ఇమ్రాన్ ఖాన్​: అక్తర్

ABOUT THE AUTHOR

...view details