టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే కోచ్ రవిశాస్త్రి కొరకు ఒక స్పెషల్ గిఫ్ట్‌ను పంపించాడు. దీనికి సంబంధించిన ఫొటోను నెట్టింట పంచుకున్నాడు షమీ. "రవి భాయ్ మీకోసం సేమియా, కీర్, మటన్ బిర్యానీ పంపిస్తున్నా" అంటూ వ్యాఖ్యను జోడించాడు.
రవిశాస్త్రికి మటన్ బిర్యానీ కొరియర్ చేసిన షమీ
టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రికి మటన్ బిర్యానీ కొరియర్ చేసి పంపించాడు పేసర్ షమీ. ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
షమీ
ప్రస్తతం లాక్డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నాడు షమీ. తన వ్యవసాయ క్షేత్రంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నాడు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకుంటున్నాడు.