తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్ నుంచి​ పాక్​కు మద్దతు కావాలి: మిస్బా

శ్రీలంక పాక్​లో పర్యటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఇందుకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు పాక్ కోచ్ మిస్బా ఉల్ హక్​. తమ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి మద్దతు కావాలని చెప్పాడు.

మిస్బా ఉల్ హఖ్

By

Published : Sep 26, 2019, 8:26 AM IST

Updated : Oct 2, 2019, 1:27 AM IST

పాకిస్థాన్​ క్రికెట్​ను పునరుద్ధరించాలని ప్రపంచాన్ని డిమాండ్​ చేశాడు ఆ దేశ కోచ్ మిస్బా ఉల్ హక్​. ఇతర దేశాల నుంచి మద్దతు కావాలని తెలిపాడు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్​లో సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం చెప్పగా.. ద్వితీయ శ్రేణి క్రికెటర్లతో దాయాది దేశంలో పర్యటిస్తోంది లంక జట్టు.

"శ్రీలంక ఎంత కఠిన నిర్ణయం తీసుకుందో అర్థమవుతుంది. కానీ పాకిస్థాన్ ప్రజలు క్రికెట్​ను ఎంతో ఆరాధిస్తారు. పాకిస్థానే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేశానికైన ఐసీసీ నుంచి మద్దతు కావాలి. లేకుంటే క్రికెట్​ ఉనికే ప్రమాదంలో పడుతుంది. శ్రీలంక మా దేశంలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది. అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు" - మిస్బాఉల్ హక్, పాకిస్థాన్ కోచ్​

పాకిస్థాన్​తో మూడు టీ-20ల సిరీస్ ఆడనుంది శ్రీలంక. లాహోర్ వేదికగా అక్టోబర్ 5 నుంచి 9 వరకు ఈ సిరీస్ జరగనుంది. 2009లో లంక ఆటగాళ్లు వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన దగ్గరి నుంచి ఏ దక్షిణాసియా దేశం పాకిస్థాన్​లో పర్యటించలేదు.

ఇదీ చదవండి: 'సోషల్ మీడియా కాదు... ముందు ఆటపై దృష్టి పెట్టు'

Last Updated : Oct 2, 2019, 1:27 AM IST

ABOUT THE AUTHOR

...view details