తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బౌండరీ కౌంట్'​పై త్వరలో కుంబ్లే కమిటీ చర్చ - kumble

బౌండరీ కౌంట్​, ఇతర విషయాలపై చర్చించేందుకు అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో జరగనున్న సమావేశంలో ఈ విషయాలు చర్చించనున్నారు.

కుంబ్లే

By

Published : Jul 29, 2019, 5:45 AM IST

2019 ప్రపంచకప్​ ఫైనల్​లో బౌండరీ కౌంట్ విధానం ఎంతో వివాదానికి దారి తీసింది. విజేతను ఈ విధంగా నిర్ణయించడాన్ని మాజీలు, క్రీడా విశ్లేషకుల తప్పుపట్టారు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడనుంది.వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఐసీసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ.

"వరల్డ్​కప్ ఫైనల్​లో జరిగిన విషయాలపై ఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కుంబ్లే దీనికి అధ్యక్షత వహిస్తాడు. వచ్చే సమావేశంలో ఈ వివాదస్పద అంశాన్ని చర్చించనుందీ కమిటీ. సూపర్ ​ఓవర్లో ఫలితం తేలకపోతే బౌండరీ కౌంట్ విధానాన్ని2009 నుంచి ఉపయోగిస్తున్నాం. దాదాపు అన్ని టీ 20 మ్యాచ్​ల్లో ఈ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. ఈ అంశంపై(బౌండరీ కౌంట్​) క్రికెట్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది" - జేఫ్ అలార్డైస్​, ఐసీసీ జనరల్ మేనేజర్.

జులై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లోనూ ఫలితం రాలేదు. ఈ కారణంగా బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు.

ఇది చదవండి: 'కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతాడు'

ABOUT THE AUTHOR

...view details