తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్ ప్రదర్శన​తో ప్రపంచకప్ జట్టులోకి వస్తా'

ఐపీఎల్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్​ తుది జట్టులో స్థానం సంపాదించటమే లక్ష్యంగా పనిచేస్తానన్నాడు టీమిండియా స్పిన్నర్​ కుల్దీప్ యాదవ్. మహిళా టీ20 ప్రపంచకప్​లో ఫైనల్​కు చేరిన హర్మన్​ సేనకు శుభాకాంక్షలు తెలిపాడు.

Kuldeep hoping for fine IPL to cement place in T20 World Cup team
ఐపీఎల్ ప్రదర్శన​తో టీ20 జట్టులో స్థానంపై కన్ను

By

Published : Mar 5, 2020, 10:31 PM IST

ఐపీఎల్​ ద్వారా భారత టీ20 ప్రపంచకప్​ తుది జట్టులో స్థానం సంపాదిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు టీమిండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​. గతేడాది జరిగిన మ్యాచ్​ల ద్వారా విదేశీ మైదానాల్లో ఉత్తమ స్పిన్​బౌలింగ్​ చేయగలడని జట్టుకు నమ్మకం కలిగినా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్​ల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీనిపై తాజాగా స్పందించాడు కుల్దీప్​​.

"న్యూజిలాండ్‌ మైదానాల్లో వికెట్లు సాధించటం మిగిలిన వాటికంటే చాలా భిన్నమైనది. టెస్టుల్లో స్పిన్ ట్రాక్‌లు లేవు. ఇది సుదీర్ఘమైన టెస్టు సిరీస్ కాదు. ఈ విషయంలో కోచ్​ రవిశాస్త్రి నాకు చాలా మద్దతుగా నిలిచాడు."

- కుల్దీప్​ యాదవ్​, టీమిండియా స్పిన్నర్​

2018 జనవరిలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​ తర్వాత మరే టెస్టు మ్యాచ్​లో ఆడలేదు కుల్దీప్. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై చివరి టీ20, తాజాగా కివీస్​పై జరిగిన వన్డే సిరీస్​లో ఒక్క మ్యాచ్​లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో మంచి ప్రదర్శన కనబరచి ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో స్థానం సంపాదించే దిశగా కృషి చేస్తున్నాడు.

హర్మన్​సేనకు శుభాకాంక్షలు

మహిళా టీ20 ప్రపంచకప్​లో ఫైనల్​కు చేరిన హర్మన్​ప్రీత్​ సేనకు శుభాకాంక్షలు తెలిపాడు కుల్దీప్​. లీగ్​ దశలోని నాలుగు మ్యాచ్​లూ గెలిచి.. ఫైనల్​కు చేరటంపై హర్షం వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్​ 18 నుంచి నవంబర్​ 15 వరకు పురుషుల టీ20 ప్రపంచకప్​ జరగనుంది.

ఇదీ చూడండి.. బంగ్లాదేశ్​ కెప్టెన్​ పదవి నుంచి తప్పుకున్న మొర్తాజా

ABOUT THE AUTHOR

...view details