తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​తో తొలి వన్డే.. కోహ్లీ ముందున్న రికార్డులు - కోహ్లీ వార్తలు

తొలి వన్డేకు ముందు కోహ్లీపై ఆసీస్ కెప్టెన్​ ఫించ్ పొగడ్తలు కురిపించాడు. అత్యుత్తమ వన్డే ఆటగాడని కితాబిచ్చాడు. అయితే ఈ సిరీస్​లో విరాట్ కొన్ని రికార్డులు అధిగమించే అవకాశం కూడా ఉంది. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) సిడ్నీలో మ్యాచ్​​ జరగనుంది.

kohli make records ahead of first ODI with australia
ఆసీస్​తో తొలి వన్డే.. కోహ్లీ ముందున్న రికార్డులు

By

Published : Nov 26, 2020, 4:20 PM IST

Updated : Nov 26, 2020, 5:13 PM IST

భారత్​తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్​ఇండియా సారథి కోహ్లీ, వన్డే అత్యుత్తమ ప్లేయర్ అని ప్రశంసించాడు. అతడిని వీలైనంత త్వరగా ఔట్ చేసేందుకు తాము ప్రణాళికలు వేస్తున్నామని తెలిపాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టులో ఫించ్ ఆడటం విశేషం.

రికార్డులకు అడుగు దూరంలో కోహ్లీ

ప్రస్తుతం వన్డేల్లో 11,867 పరుగులతో ఉన్న కోహ్లీ.. మరో 133 పరుగులు చేస్తే 12 వేల క్లబ్​లో చేరతాడు. మూడు వన్డేలు జరగనున్న నేపథ్యంలో విరాట్ ఈ ఘనతను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అలానే రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్​కు అందుబాటులో లేకపోవడం వల్ల దృష్టంతా కోహ్లీపైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ట్రోఫీతో భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్లు

అలానే అన్ని ఫార్మాట్​లు కలిపి 70 సెంచరీలతో ఉన్న కోహ్లీ.. మరో రెండు శతకాలు చేస్తే ఆసీస్ దిగ్గజ బ్యాట్స్​మన్ పాంటింగ్​(70)ను అధిగమిస్తాడు. దీంతో క్రికెట్​లో ఎక్కువ సెంచరీలు చేసిన వారిలో సచిన్(100) తర్వాతి స్థానంలో విరాట్ నిలుస్తాడు.

ఈ పర్యటనలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

Last Updated : Nov 26, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details