బొటనవేలికి సర్జరీ తర్వాత ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. గురువారం నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశాడు. దాదాపుగా రెండు నెలల తర్వాత జడేజా బ్యాట్ పట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను జడ్డూ ట్విట్టర్లో పంచుకున్నాడు.
"రెండు నెలల తర్వాత బ్యాట్, బాల్ పట్టుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది" అని భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు.