రానున్న ఐపీఎల్ కోసం ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ముంబయికి చేరుకుంటున్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య.. ముంబయికి చేరుకున్నారు. ముంబయి ఇండియన్స్ స్క్వాడ్‌తో కలిశారు. ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంచైజీ ధ్రువీకరించింది.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ముంబయి.. రోహిత్‌తో పాటు సూర్య, హార్దిక్, కృనాల్ జట్టుతో కలిసినట్లు ట్వీట్ చేసింది. ఇటీవల ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లకు నేరుగా తమ జట్టుతో కలిసే అవకాశమిచ్చింది బీసీసీఐ. మిగతా వారికి వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ విధించింది.