తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 10:30 PM IST

ETV Bharat / sports

హోరాహోరీ పోరులో బోణీ కొట్టిన టీమిండియా

పరుగుల వరద పారిన తొలి టీ20లో గెలుపు భారత్​నే వరించింది. విండీస్​పై 6 వికెట్ల తేడాతో కోహ్లీసేన గెలిచింది. ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్..​ టీ20ల్లో 1000 పరుగుల్ని పూర్తి చేశాడు.

హోరాహోరీ పోరులో బోణీ కొట్టిన టీమిండియా
రాహుల్

హైదరాబాద్​లో జరిగిన తొలి టీ20లో టీమిండియా.. 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్​ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. కేఎల్ రాహుల్(62), కోహ్లీ(94) అర్ధ శతకాలు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఓపెనర్లలో రోహిత్​ శర్మ 8 పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసిన రాహుల్..​ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ రెండో వికెట్​కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్.. టీ20ల్లో 1000 పరుగుల మార్క్​ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.

టీ20ల్లో 1000 పరుగుల మార్క్​ను అందుకున్న

ఆ తర్వాత మిగతా లాంఛనాన్ని కోహ్లీ పూర్తి చేశాడు. 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విండీస్​ బౌలర్లలో కారీ పియర్రే 2, కాట్రెల్, పొలార్డ్ తలో వికెట్ తీయగలిగారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది వెస్టిండీస్. ఓపెనర్​ సిమన్స్ త్వరగానే ఔటయ్యాడు. మరో ఎండ్​లో ఉన్న లూయిస్ చెలరేగాడు. 17 బంతుల్లో 40 పరుగులు చేసి వెనుదిరిగాడు. హెట్మయిర్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

బ్యాటింగ్ చేస్తున్న విండీస్ క్రికెటర్లు

చివర్లో వచ్చిన హోల్డర్ 9 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టు స్కోరు 200 దాటేందుకు సహాయపడ్డాడు. మిగతా వారిలో కింగ్ 31, పొలార్డ్ 37 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో చాహల్ 2 వికెట్లు తీయగా, సుందర్, చాహర్, జడేజా తలో వికెట్​ దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details