తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్​కు హిట్​మ్యాన్​ దూరం..?

డిసెంబర్​ 6 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్​ సిరీస్​కు టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు ఫార్మాట్​ల్లో రెగ్యులర్‌ ఆటగాడిగా ఆడుతున్నాడు హిట్​మ్యాన్​. అయితే రొటేషన్ పద్ధతిలో సెలక్టర్లు ఒక్కొక్కరికి విశ్రాంతినిస్తున్నారు.

By

Published : Nov 20, 2019, 5:26 AM IST

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్​కు హిట్​మ్యాన్​ దూరం..?

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా... వచ్చే నెలలో కరీబియన్​ ఆటగాళ్లతో తలపడనుంది. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడనుంది కోహ్లీ సేన. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)షెడ్యూల్‌నూ రూపొందించింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి భారత్​-విండీస్​ జట్లు. డిసెంబర్​ 22వ తేదీతో పర్యటన ముగియనుంది.

రోహిత్​కు విశ్రాంతి...

బంగ్లాదేశ్​తో మూడు టీ20 సిరీస్​కు కోహ్లీకి విశ్రాంతినిచ్చింది టీమిండియా. డిసెంబరులో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రానిచ్చే అవకాశముంది. ఈ నెల 21న (గురువారం) ముంబయిలో యాజమాన్యం సమావేశం కానుంది. ఆ సమయంలో ఆటగాళ్ల పనిభారం గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు రోహిత్​. ఇందులో 16 ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండగా.. మిగిలినవి టీ20లు, వన్డేలు, టెస్టులు ఉన్నాయి.

బుమ్రా దూరమే..

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు వెన్నుగాయంతో బాధ పడిన బుమ్రా... రెండు నెలలుగా చికిత్స తీసుకుంటూ క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. త్వరలో జరగనున్న విండీస్​ పర్యటనకూ ఈ స్పీడ్​స్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు​. అయితే వచ్చే ఏడాది జనవరిలో మాత్రం కచ్చితంగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ప్రపంచకప్​ తర్వాత ఏ సిరీస్​ల్లో ​ఆడని ధోనీ... ఈ మ్యాచ్​లకు సెలక్షన్​ కమిటీకి అందుబాటులో ఉండకపోవచ్చు.

ఇవే వేదికలు...

భారత్, వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6న వాంఖడే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 8న తిరువనంతపురంలో రెండో టీ20 నిర్వహించనున్నారు. ఆఖరి టీ20 మ్యాచ్​ డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. డిసెంబరు 15న చెన్నై వేదికగా తొలి వన్డే.. 18న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే, ఆఖరి వన్డే కటక్‌లో 22న నిర్వహించనున్నారు. టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుండగా.. వన్డేలు మధ్యాహ్నం 2 నుంచి మొదలుకానున్నాయి.

For All Latest Updates

TAGGED:

Rohit Sharma

ABOUT THE AUTHOR

...view details