తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజృంభిస్తోన్న స్పిన్నర్లు.. ఇంగ్లాండ్ విలవిల

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమ్ఇండియా విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు లంచ్ సమయా0నికి 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఇంకా 366 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉండగా ఇంగ్లీష్ జట్టు ఓటమి దాదాపు ఖరారైనట్లే. మొదటి ఇన్నింగ్స్​లో సత్తాచాటిన స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్​లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

India vs England
విజృంభిస్తోన్న స్పిన్నర్లు.. ఇంగ్లాండ్ విలవిల

By

Published : Feb 16, 2021, 11:58 AM IST

Updated : Feb 16, 2021, 12:06 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్​లో 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆటలో తడబడుతోంది. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇంకా 366 పరుగుల వెనుకంజలో ఉంది.

మెరిసిన అశ్విన్, అక్షర్

మొదటి ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు సాధించి బంతితో సత్తాచాటిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్​లో 106 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్​లో బంతితోనూ మెరిశాడు అశ్విన్. ప్రస్తుతం మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతడితో పాటు అక్షర్ పటేల్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరి స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ దగ్గర సమాధానం లేకపోయింది.

వికెట్లు పడ్డాయిలా!

ఓవర్​నైట్ స్కోర్ 53/3తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్​ నాలుగు రోజు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది. టీమ్ఇండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్​మెన్ ఒకరి వెంట ఒకరు వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు.

  • నాలుగు రోజు మొదటి వికెట్​గా వెనుదిరిగాడు డానియల్ లారెన్స్. 26 పరుగులతో క్రీజులో కుదురుకుంటున్న ఇతడిని అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఇతడి బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు లారెన్స్.
  • తర్వాత ఆల్​రౌండర్​ బెన్ స్టోక్స్​ కోహ్లీకి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్​లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.
  • కాసేపటికి ఒల్లీ పోప్ అక్షర్ పటేల్ బౌలింగ్​లో ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 110 పరుగుల వద్ద ఇతడు పెవిలియన్ చేరాడు.
  • మరో ఆరు పరుగుల జోడించిన ఇంగ్లాండ్ 116 పరుగుల వద్ద వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ఫోక్స్ కుల్దీప్ బౌలింగ్​లో అక్షర్ పటేల్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

స్టోక్స్​కు అశ్విన్ గండం

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్.. అశ్విన్ స్పిన్ మంత్రం నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఇతడిని 10సార్లు ఔట్ చేశాడు అశ్విన్. టెస్టుల్లో అత్యధికంగా వార్నర్​ను 10సార్లు పెవిలియన్ చేర్చిన అశ్విన్.. తాజా టెస్టుతో స్టోక్స్​ను 10సార్లు ఔట్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Last Updated : Feb 16, 2021, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details