ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో(చివరి) టెస్టులో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్(7).. కమిన్స్ బౌలింగ్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌గా రోహిత్(44) లయన్ బౌలింగ్‌లో స్టార్క్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రెండు రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్.. రెండు వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. అనంతరం వర్షం కురుస్తుండటం వల్ల మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది.
ఆగకుండా వర్షం.. నాలుగో టెస్టుకు ఆటంకం - భారత్ ఆసీస్ నాలుగో టెస్టు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న గబ్బా టెస్టులో రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. టీ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
భారత్
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. శనివారం 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు మరో 95 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టిమ్‌పైన్ అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో నటరాజన్, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Last Updated : Jan 16, 2021, 12:30 PM IST
TAGGED:
brisbane test