తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు ఛాంపియన్​షిప్​లో టీమిండియా జోరు.. అగ్రస్థానం పదిలం - ICC WTC

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో 240 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలపరచుకుంది టీమిండియా. దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్​ చేసి టాప్​-1ను నిలబెట్టుకుంది కోహ్లీసేన.

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​

By

Published : Oct 22, 2019, 3:40 PM IST

Updated : Oct 22, 2019, 5:35 PM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్​ను 3-0 తేడాతో నెగ్గి మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. మొత్తం 240 పాయింట్లు సాధించింది కోహ్లీసేన.

ఈ సిరీస్​లో 120 పాయింట్లు ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఒక్కో మ్యాచ్​కు 40 పాయింట్ల చొప్పున మూడు టెస్టులకుగానూ 120 పాయింట్లు కైవసం చేసుకుంది. ఈ సిరీస్​కు ముందు వెస్టిండీస్ పైనా 2-0 తేడాతో నెగ్గి 120 పాయింట్లు సాధించింది.

టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్.. అగ్రస్థానాన్ని మరింత పదిలంచేసుకునే అవకాశముంది. వచ్చే నెల 14 నుంచి బంగ్లాదేశ్​తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్​లు సొంతగడ్డపై జరగనున్నాయి. ఈ కారణంగా టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

టీమిండియా

శ్రీలంక, న్యూజిలాండ్ చెరో 60 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్​ను 1-1 తేడాతో డ్రా చేసుకున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చెరో 56 పాయింట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 5 మ్యాచ్​ల యాషెస్ సిరీస్​ 2-2 తేడాతో డ్రా అయింది.

టెస్టు ఛాంపియన్​షిప్​లో సిరీస్​కు 120 పాయింట్లు ఉంటాయి. పాయింట్ల పట్టికలో టాప్​-2లో ఉన్న జట్లు ఫైనల్​కు అర్హత సాధిస్తాయి. తుదిపోరు 2021 జులైలో జరగనుంది. టోర్నీలో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరీస్​లు ఆడుతుంది.

ఇదీ చదవండి: కోహ్లీ, కోచ్ వల్లే ఇలా ఆడగలిగా: రోహిత్​

Last Updated : Oct 22, 2019, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details