దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తాచాటి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వల్లే ఈ ప్రదర్శన సాధ్యమైందని, టెస్టుల్లోనూ ఓపెనింగ్ చేయగలనని వాళ్లు గుర్తించారని తెలిపాడు.
"కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నాకు మద్దతుగా నిలిచారు. టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశాన్నిచ్చిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. వన్డేల్లో 2013 నుంచి ఓపెనర్‌గా రావడం ప్రారంభించా. టెస్టుల్లో రాణించాలంటే క్రమశిక్షణ అవసరం. ఈ కారణంగానే ఈ రోజు ఇలా ఆడగలుగుతున్నా" - రోహిత్ శర్మ, టీమిండియా ఓపెనర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్‌ను తప్పించి.. రోహిత్ శర్మను సారథిగా చేస్తారనే ఊహాగానాలు ఇటీవల హల్చల్ చేశాయి. వీటిపై ఇంతకుముందే వివరణ ఇచ్చాడు రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తేల్చిచెప్పారు.
ఈ సిరీస్‌లో రోహిత్ 529 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు(176, 127).. ఓ ద్విశతకం(212) ఉంది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది కోహ్లీసేన.
ఇదీ చదవండి: ఆర్మీపై అభిమానాన్ని మరోసారి చాటుకున్న ధోనీ