పుణె వేదికగా భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టుజరుగుతోంది. రెండో రోజు లంచ్ విరామానికి కోహ్లీసేన.. 3 వికెట్ల నష్టానికి 356 పరుగులతో నిలిచింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం క్రీజులో ఇతడితో పాటు రహనే ఉన్నారు.
విరాట్ సెంచరీ.. లంచ్ సమయానికి 356/3
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు శతకం చేశాడు కోహ్లీ. లంచ్ సమయానికి 356/3తో నిలిచింది టీమిండియా.
కోహ్లీ
ఓవర్నైట్ స్కోరు 273/3తో ప్రారంభించింది టీమిండియా. అనంతరం సఫారీ బౌలర్లనుభారత బ్యాట్స్మెన్ ధాటిగా ఎదుర్కొంటున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్లోనూ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది.