ఈ ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా.. పసికూన అఫ్గానిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. సౌతాంఫ్టన్ వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న కోహ్లీ సేనను నిలువరించాలంటే అఫ్గాన్ జట్టుకు కత్తిమీద సామే.
ప్రస్తుత పాయింట్ల పట్టికలో నాలుగులో ఉంది టీమిండియా. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. కివీస్‌తో పోరు వర్షం కారణంగా రద్దయింది. ఈరోజు గెలిచి సెమీస్ మార్గాన్ని సుగమం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంది అఫ్గానిస్థాన్.
గాయంతో ఈ ప్రపంచకప్ మొత్తానికే ధావన్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించేందుకు సిద్ధమవుతున్నారు రోహిత్, రాహుల్, కోహ్లీ. బౌలర్ భువనేశ్వర్‌కు గాయం కావడంతో షమి బరిలోకి దిగనున్నాడు.
ప్రత్యర్ధి జట్టులో రషీద్ ఖాన్, నబీ స్పిన్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు స్పిన్ బౌలింగ్‌లో ఒక్క వికెటైనా కోల్పోలేదు టీమిండియా.