తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధర్మశాలలో భారత్​, దక్షిణాఫ్రికా జట్ల సందడి

పొట్టి ఫార్మాట్​లో అదరగొట్టేందుకు భారత, దక్షిణాఫ్రికా క్రికెట్​ జట్లు సిద్ధమవుతున్నాయి. మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు హిమాచల్​ ప్రదేశ్​లోని ధర్మశాల వేదిక కానుంది. శుక్రవారం ఇక్కడకు చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది.

ధర్మశాలలో భారత్​-దక్షిణాఫ్రికా జట్ల సందడి

By

Published : Sep 14, 2019, 10:14 AM IST

Updated : Sep 30, 2019, 1:36 PM IST

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు

భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టీ20​ కోసం ఇరుజట్లు హిమాచల్​ ప్రదేశ్​లోని ధర్మశాలకు చేరుకున్నాయి. టీమిండియాకుశుక్రవారం ఘన స్వాగతం లభించింది.

సెప్టెంబర్​ 9న ధర్మశాల వచ్చిన సఫారీ ఆటగాళ్లకు కాస్త విరామం దొరకడం వల్ల మెక్లోడ్​గంజ్​ ప్రాంతంలో షాపింగ్​ చేశారు. కొందరు హెయిర్​కట్ కూడా​ చేయించుకున్నారు. స్థానికంగా దొరికే వస్తువులు కొనుగోలు చేశారు. టిబెటియన్​ డంప్​లింగ్స్​ వంటి సంప్రదాయ ఆహారపదార్థాలను రుచిచూశారు. దక్షిణాఫ్రికా సారథి క్వింటన్​ డికాక్​ సహా కొంత మంది ప్లేయర్లు హొటల్​లోనే గడిపారు.

ఐపీఎల్​లో దిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగిన రబాడ.. టోర్నీ ఆఖరులో ప్రపంచకప్​ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఈ టోర్నీ కోసం ఇప్పుడు భారత్​కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

" ఇండియాలో మళ్లీ అడుగుపెట్టి క్రికెట్​ ఆడటం చాలా ఆనందంగా ఉంది".
రబాడ, దక్షిణాఫ్రికా బౌలర్​

భారత జట్టు:

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​ శర్మ (వైస్​ కెప్టెన్​), ధావన్​, కేఎల్​ రాహుల్​, శ్రేయాస్​ అయ్యర్​, మనీష్​ పాండే, రిషబ్​ పంత్​ (కీపర్​), హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా, కృణాల్​ పాండ్య, వాషింగ్టన్​ సుందర్​, రాహుల్​ చాహర్​, ఖలీల్​ అహ్మద్​, దీపక్​ చాహర్​, నవదీప్​ సైనీ.

దక్షిణాఫ్రికా జట్టు:

క్వింటన్​ డికాక్ ​(సారథి), డసెన్ ​(ఉప సారథి), తంబే బువమా, జూనియర్​ డలా, ఫార్చ్యూన్​, బ్యూరెన్​ హెండ్రిక్స్​, రీజా హెండ్రిక్స్​, డేవిడ్​ మిల్లర్​, ఆన్రిచ్ నోర్టజే, ఫెలుక్వాయో, ప్రిటోరియస్​, రబాడ, తబ్రేజ్​ షంశీ, జార్డ్​ లిండే.

ఫొట్టి ఫార్మాట్​ మ్యాచ్​లు ముగిశాక ప్రోటీస్​ జట్టుతోనే మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆరంభం కానుంది. మొదటి టెస్టు విశాఖలో (అక్టోబర్​ 2-6), రెండోది పుణె (అక్టోబర్​ 10-14), మూడోది రాంచీ (అక్టోబర్​ 19-23)లో నిర్వహించనున్నారు. ఈ సిరీస్​తోనే సఫారీ జట్టు తన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను ఆరంభించనుంది.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details