తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్:​ టాప్​లోనే భారత్​ , ఇంగ్లండ్ - odi rankings

టెస్ట్ ర్యాంకింగ్స్​లో భారత్​, వన్డేల్లో ఇంగ్లండ్ నంబర్‌వన్​గా కొనసాగుతున్నాయి. సవరించిన వార్షిక ర్యాంకుల జాబితాను ​విడుదల చేసింది ఐసీసీ.

ఐసీసీ ర్యాంకింగ్స్​లో టాప్​లో భారత్​ , ఇంగ్లండ్

By

Published : May 3, 2019, 1:15 PM IST

Updated : May 3, 2019, 2:02 PM IST

టెస్టుల్లో భారత్​, వన్డే జాబితాలో ఇంగ్లండ్​ తొలిస్థానాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా ఐసీసీ దీనికి సంబంధించిన మార్పులు చేసిన జాబితాను వెల్లడించింది. ఇందులో 2015-16లో జరిగిన మ్యాచ్ ఫలితాల రికార్డులను తొలగించి.. 2016-17, 2017-18 సిరీస్‌ల నుంచి 50 శాతం సరాసరిని పరిగణనలోకి తీసుకుంది.

ఈ తాజా జాబితాకు ముందు... టెస్టుల్లో భారత్ (116), న్యూజిలాండ్ (108) మధ్య 8 పాయింట్ల అంతరం ఉండేది. కానీ 2015-16లో దక్షిణాఫ్రికా, శ్రీలంకపై భారత్​ సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా టీమ్‌ఇండియా ఖాతాలోంచి మూడు పాయింట్లు కోత విధించారు. కివీస్​కు 3 పాయింట్లు పెరిగాయి. ప్రస్తుతం భారత్​ (113), న్యూజిలాండ్​​ (111)తో వరుసగా ఒకటి, రెండో ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా (98)ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ (105) నాలుగో స్థానానికి ఎగబాకింది. 7, 8 ర్యాంకుల్లో పాకిస్థాన్, వెస్టిండీస్ కొనసాగుతున్నాయి.

ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకులు

రెండే పాయింట్లు తేడా...

ప్రస్తుతం వన్డేల్లో ఇంగ్లండ్ (123) పాయింట్లతో టాప్​లో ఉంది. భారత్​ (121) పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 3 పాయింట్లు మెరుగుపడి మూడో స్థానంలోకి రాగా, న్యూజిలాండ్‌ నాలుగో స్థానానికి పడిపోయింది.

ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకులు

హోదా వచ్చినా ఫలితం నిల్​...

  1. అఫ్ఘానిస్థాన్​, ఐర్లాండ్​ జట్లు టెస్టు హోదా దక్కించుకున్నా...సరిపడా మ్యాచ్​లు ఆడకపోవడం వల్ల టెస్టు ర్యాంకుల జాబితాలో చోటు దక్కలేదు.
  2. నమీబియా, నెదర్లాండ్స్​, ఒమన్​, యూఎస్​ఏ కొత్తగా వన్డే హోదా పొందాయి. కానీ ఇవి కూడా ఎక్కువగా మ్యాచ్​లు ఆడకపోవడం కారణంగా ర్యాంకింగ్స్​ జాబితాలో స్థానం లభించలేదు.

టీ20 ర్యాంకింగ్స్​లో అయిదో స్థానం...

తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్​(286) తొలిస్థానంలో కొనసాగుతోంది. భారత్​(260) పాయింట్లతో మూడు స్థానాలు దిగజారి... అయిదో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(262), ఇంగ్లండ్​ (261), ఆస్ట్రేలియా (261) పాయింట్లతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 2015-16 ఏడాది విజయాలను తొలగించి.. 2016-17, 2017-18 ఫలితాలనే పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా భారత్​ రెండో స్థానం నుంచి అయిదో స్థానానికి పడిపోయింది. నేపాల్​ 11, నమీబియా 20వ స్థానం సంపాదించుకున్నాయి.

Last Updated : May 3, 2019, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details