9/2 ఓవర్‌నైట్ స్కోరు వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్లో ఉమేష్ వేసిన ఐదో బంతిని ఆడిన డుప్లెసిస్(1) బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ జట్టు స్కోరు 16 పరుగులే.
అనంతరం మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు సఫారీ బ్యాట్స్‌మెన్. బవుమా(32) సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు జుబైర్ హమ్జా(63). ధాటిగా ఆడి అర్ధశతకం పూర్తి చేశాడు జుబైర్. అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడకుండా జడేజా అతడిని పెవిలియన్ చేర్చాడు. 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వెంటనే బవుమానూ స్టంపౌట్ చేశాడు నదీమ్.