పట్టుబిగించిన భారత్.. టీ విరామానికి 221/8 - ind vs eng live score
రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న భారత్.. భారీ ఆధిక్యంలో ఉంది. అశ్విన్ అర్ధశతకంతో ఆకట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు.
పట్టుబిగించిన భారత్.. టీ విరామానికి 221/8
మూడో రోజు ఆటలో రెండో సెషన్ పూర్తయ్యేసరికి భారత్ 221/8 స్కోర్‌తో నిలిచింది. అశ్విన్(68) కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడికి తోడుగా ప్రస్తుతం ఇషాంత్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు. ఈ సెషన్‌లో మొత్తం 25 ఓవర్లలో భారత్ 65 పరుగులు సాధించి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(62), కుల్‌దీప్ యాదవ్(3)ను మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. ఇద్దరినీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత్ 416 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.