ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమ్ఇండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు తొలి సెషన్ పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.
బ్రిస్బేన్ టెస్టు: లంచ్ విరామానికి టీమిండియా 161/4 - ind vs aus brisbane first innings
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(38), పంత్(4) ఉన్నారు.
బ్రిస్బేన్
ఓవర్‌నైట్ స్కోరు 62/2 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 105 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా(25) పైన్ చేతికి చిక్కాడు. 37 పరుగులు చేసిన రహానే నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్(38), పంత్(4) ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది.