దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టులో స్థానం లభించకపోవడంపై స్పందించాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. తనకు బాధగా లేదని, టెస్టుల్లో మరింత రాటుదేలేందుకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నాడు.
"పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ప్రదర్శన చేశా. వన్డే, టీ20లు ఆడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. టీ20 సిరీస్‌లో చోటు దక్కకపోవడంపై బాధగా లేదు. బహుశా సెలక్టర్లు నాకు విశ్రాంతి కావాలని భావించారేమో. లేదా కొన్ని మార్పులు చేయాలని అనుకుని ఉండొచ్చు. టెస్టుల్లో మరింతగా రాణించడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నా" -కుల్దీప్ యాదవ్, టీమిండియా స్పిన్నర్
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కుల్దీప్ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20లకూ ఈ ఆటగాడికి అవకాశం లభించలేదు.