తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​-పాక్​ మధ్య క్రికెట్ పునరుద్ధరించండి' - పీసీబీ

భారత్​-పాకిస్థాన్​ల మధ్య క్రికెట్ సంబంధాలు తిరిగి పునరుద్ధరించాలని సూచించాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్. తన పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో ద్వైపాక్షిక సిరీస్​ను ప్రారంభించడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు.

I suggested to the BCCI that we should hold a Jinnah-Gandhi series: Ex-PCB chief Zaka Ashraf
'భారత్​-పాక్​ల మధ్య క్రికెట్ పునరుద్ధరించండి'

By

Published : Mar 21, 2021, 6:17 PM IST

భారత్, పాకిస్థాన్​ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ను తిరిగి పునరుద్ధరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ బీసీసీఐకి సూచించాడు​. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా భారత ప్రభుత్వం క్రికెట్​ ఆడకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొద్ది కాలంగా ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలు కూడా క్షీణించాయి.

భారత్​-పాక్​ మధ్య చివరి సారిగా 2007లో టెస్టు సిరీస్ జరిగింది. 2012-13 మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ఆసియా కప్​, ఐసీసీ టోర్నమెంట్​లలో తప్పితే రెండు దేశాల మధ్య ఎటువంటి సిరీస్​లు జరగలేదు. రానున్న రోజుల్లోనూ దాయాది దేశంతో క్రికెట్ ఆడే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ రెండు దేశాలు చివరిసారిగా 2019 ప్రపంచకప్​లో తలపడ్డాయి. దీంతో అష్రాఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

నా పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో సిరీస్​ను ప్రారంభించడానికి ప్రయత్నించాను. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాను. ఉగ్రవాద అంశాల కారణంగా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది.

-జాకా అష్రాఫ్, పీసీబీ మాజీ ఛైర్మన్.

"జిన్నా-గాంధీ పేరుతో సిరీస్​ ప్రారంభిస్తే.. ఇరు దేశాల మధ్య క్రికెట్​ సంబంధాలు బలోపేతమవుతాయి. ఇది మరో యాషెస్​ సిరీస్​లా మారుతుంది" అని అష్రాఫ్​ పేర్కొన్నారు. అష్రాఫ్​ కాలంలోనే ఇరు దేశాలు చివరి ద్వైపాక్షిక సిరీస్​ను ఆడాయి.

ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్​లకు తటస్థ వేదికలు మేలని అభిప్రాయపడ్డాడు అష్రాఫ్​. శ్రీలంక, యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో సిరీస్​లను నిర్వహిస్తే బాగుంటుందని తెలిపాడు. ఐసీసీ తెచ్చిన ఎఫ్​టీపీ నిబంధన కూడా పాకిస్థాన్​తో, భారత్ క్రికెట్​ ఆడకపోవడానికి మరో కారణమని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:'రాహుల్​ ఆడకపోవడం భారత్​కు మంచిదైంది'

ABOUT THE AUTHOR

...view details