వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు బుమ్రా. తన టెస్టు కెరీర్లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. అయితే ఈ ఘనతకు కెప్టెన్ కోహ్లీనే కారణమని అన్నాడు. హ్యాట్రిక్ అందుకునే క్రమంలో విండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అనంతరం థర్డ్ అంపైర్ అప్పీల్ విజయవంతం కావడం వల్లే ఈ అరుదైన ఘనత సాధించినట్లు చెప్పాడు బుమ్రా.
"అప్పుడు ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. ఛేజ్ ఔట్‌పై అప్పీలు చేయాలా వద్దా అనే సందిగ్ధావస్థలో ఉన్నా. అప్పుడు కోహ్లీ తీసుకున్న సమీక్ష అనుకూలంగా వచ్చింది. అందుకే ఈ హ్యాట్రిక్ ఘనత కోహ్లీదే" -బుమ్రా, టీమిండియా బౌలర్
తొలి టెస్టులో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న బుమ్రా.. రెండో మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ నమోదు చేశాడు. మొత్తంగా 16 పరుగులిచ్చి 6 వికెట్లు పటగొట్టాడు. టాప్-5 బ్యాట్స్‌మెన్ బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరగడం విశేషం.
వికెట్ తీసిన ఆనందంలో జస్ప్రీత్ బుమ్రా రెండో రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది వెస్టిండీస్. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది టీమిండియా. హనుమ విహారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్ ఇషాంత్ శర్మ అర్ధశతకంతో రాణించాడు.
ఇది చదవండి: భావోద్వేగభరితం.. ఆ టెన్నిస్ మ్యాచ్