కరోనా వైరస్‌పై పోరాటానికి మాటలు కాదు ఆర్థిక సహాయం అవసరమని చెప్తున్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. తాజాగా దిల్లీలో ఈ మహమ్మారి కట్టడి కోసం భారీ విరాళం ప్రకటించాడు. తూర్పు దిల్లీ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్.. తన ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు.. ప్రభుత్వానికి అందించేందుకు ముందుకొచ్చాడు.
దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం విరాళంగా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశాడు. ఆ డబ్బుతో ఆసుపత్రులకి అవసరమైన సదుపాయాల్ని సమకూర్చాలని కోరాడు.