తెలంగాణ

telangana

ETV Bharat / sports

"పంత్​కు అనుభవం తక్కువ "

పంత్ మంచి ఆటగాడే అయినా కేవలం మూడు వన్డేలు ఆడిన అతడిని ప్రపంచకప్​కు ఎలా ఎంపిక చేస్తారని గంగూలీ ప్రశ్నించాడు.

గంగూలీ

By

Published : Mar 2, 2019, 6:31 AM IST

పంత్ ప్రపంచకప్​లో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. కెప్టెన్ కోహ్లీ మాత్రం పంత్, రాహుల్​కి ప్రపంచకప్​కు ముందు ఎక్కువ అవకాశాలు ఇస్తామంటున్నాడు. దీనిపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందిస్తూ పంత్ చాలా విలువైన ఆటగాడని.. అనుభవం తక్కువని అన్నాడు.

ఇప్పటివరకు కేవలం మూడు వన్డేలు ఆడిన పంత్​కు ప్రపంచకప్​లో ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించాడు గంగూలీ. భవిష్యత్​లో పంత్ గొప్ప ఆటగాడవుతాడని కితాబిచ్చాడు.

"ప్రస్తుతం భారత జట్టు చాలా బలంగా ఉంది. తుది ఎంపికలో ఎక్కువ మార్పులు కనిపించకపోవచ్చు. బౌలింగ్​లో బుమ్రా, భువనేశ్వర్, షమి, స్పిన్నర్లు చాహల్, కుల్​దీప్​లు కీలక పాత్ర వహిస్తారు. టీ20 సిరీస్​లో రాహుల్ చాలా బాగా ఆడాడు. విదేశాల్లోనూ ఇదే ఫామ్​ను కొనసాగించాలి. ప్రపంచకప్ ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. అన్ని జట్లు చాలా బలంగా ఉన్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్​తో పాటు తాజాగా దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిచిన శ్రీలంక కూడా బలంగా ఉంది. ఆసీస్​తో సిరీస్​ను గెలిచి సానుకూల దృక్ఫథంలో భారత్ ప్రపంచకప్​కు వెళ్లాలి.

-గంగూలీ, భారత జట్టు మాజీ కెప్టెన్

ప్రపంచకప్ తుదిజట్టులో కేవలం రెండు స్థానాలే ఖాళీ ఉన్నాయని అంటుంది సెలక్షన్ కమిటీ. ఇప్పటికే 12 నుంచి 13 స్థానాలకు ఎంపిక పూర్తయిందని చెబుతోంది. మెగా టోర్నీకి ముందు భారత్ ఆస్ట్రేలియాతో చివరి సిరీస్ ఆడబోతోంది. వన్డే సిరీస్ కోసం దినేష్ కార్తీక్​ని ఎంపికచేయని కమిటీ పంత్​కు మరో అవకాశం ఇచ్చింది.

ఇవీ చదవండి.. ఐపీఎల్ కొలమానం కాదు

ABOUT THE AUTHOR

...view details