తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నన్ను అన్యాయంగా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

టీమ్ ​ఇండియా సారథిగా తాను తప్పుకోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2007 ప్రపంచ కప్​ గెలవాలని కలలు కన్న తనను.. అన్యాయంగా కెప్టెన్సీ నుంచి తొలగించారని వివరించాడు. మొత్తం వ్యవస్థ మద్దతుతోనే ఇదంతా జరిగిందని తెలిపాడు.

By

Published : Jul 11, 2020, 6:51 AM IST

Updated : Jul 11, 2020, 7:02 AM IST

Ganguly reveals how he was dropped from team, says 'every one was involved'
గంగూలీ

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా తప్పించడం తన కెరీర్లోనే అతిపెద్ద ఎదురుదెబ్బ అని టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాదా.. తనపై అన్యాయంగా వేటు వేశారని చెప్పాడు.

"2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌ వరకు వచ్చి ఓడిపోయాం. దాంతో 2007 ప్రపంచకప్‌ గెలవాలని కలలుగన్నా. నా సారథ్యంలో ఐదేళ్లు జట్టు గొప్పగా ఆడినందున నేను అలా కల కనడంలో తప్పులేదు. కానీ 2005లో అన్యాయంగా నన్ను కెప్టెన్‌గా తొలగించారు. మొదట వన్డే జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత టెస్టు జట్టులోనూ వేటు పడింది. జింబాబ్వేలో విజయం సాధించిన భారత జట్టుకు కెప్టెన్‌ నేను. ఆ సిరీస్‌ ముగించుకుని వచ్చాక కెప్టెన్సీని లాగేసుకున్నారు. నా కెరీర్లోనే అది అతిపెద్ద ఎదురుదెబ్బ అది. నాపై వేటు పడటంలో విదేశీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ ఒక్కడినే నిందించను. బోర్డుకు లేఖలు రాసి నాకు వ్యతిరేకంగా పనిచేసిన తొలి వ్యక్తి అతడే అనడంలో సందేహం లేదు. అయితే మిగతా వారు అమాయకులేం కాదు. జట్టు ఎంపికలో కోచ్‌ పాత్ర ఏమీ ఉండదు. మొత్తం వ్యవస్థ మద్దతుతోనే అలా జరిగిందని అర్థమైంది. నన్ను తప్పించడానికి అంతా కలిసికట్టుగా పనిచేశారు. అయినా నేను ఒత్తిడిలో కూరుకుపోలేదు. విశ్వాసాన్ని కోల్పోలేదు" అని గంగూలీ వివరించాడు.

2006లో పునరాగమనం చేసిన గంగూలీ 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఇదీ చూడండి:'అప్పటి వరకు కరోనాను భరించాల్సిందే'

Last Updated : Jul 11, 2020, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details