సాంకేతిక సమస్య కారణంగా సన్‌రైజర్స్, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. దీంతో అనుకున్న సమయం కన్నా మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖర్చేమో కోట్లు..లైట్లు వెలగక పాట్లు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ప్రపంచంలోనే అత్యంత ధనిక, అభిమానుల ఆదరణ పొందిన క్రికెట్ టోర్నీ. దీని కోసం కోట్లు ఖర్చుపెడతారు. కానీ ఎప్పట్నుంచో ఉన్న ఫ్లడ్‌లైట్ల సమస్యకు పరిష్కారం దొరకట్లేదు.
ఖర్చేమో కోట్లు..లైట్లు వెలగక పాట్లు
కోట్లు ఖర్చు పెట్టి మ్యాచ్‌లు నిర్వహిస్తారు, కానీ ఫ్లడ్ లైట్ల సమస్య మాత్రం పరిష్కరించట్లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
- ఈడెన్ గార్డెన్ వేదికగా హైదరాబాద్, కోల్‌కతా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో రసెల్ విధ్వంసకర ఆటతో నైట్‌రైడర్స్‌ను గెలిపించాడు.
Last Updated : Mar 25, 2019, 1:02 AM IST