నచ్చిన క్రికెటర్లపై అభిమానాన్ని వైవిధ్య రీతిలో వ్యక్తపరుస్తుంటారు అభిమానులు. ఇటీవలే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేరు, జెర్సీ నెంబర్‌ను ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకున్న ఓ వ్యక్తిని మరువక ముందే.. తాజాగా మరో ఫ్యాన్ వినూత్నంగా విరాట్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. చరవాణిలతో కోహ్లీ బొమ్మను రూపొందించి అతడి చేత అభినందనలు అందుకున్నాడు.
అసోం గుహవటికి చెందిన రాహుల్ పరేక్ మొబైల్ ఫోన్లు, వైర్ల సాయంతో విరాట్ బొమ్మను రూపొందించాడు. మూడు రోజుల్లోనే ఈ పని పూర్తి చేశాడు. అతడి అభిమానానికి ముగ్ధుడైన కోహ్లీ.. ఆటోగ్రాఫ్ ఇచ్చి అభినందించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.