ప్రపంచకప్‌లో ఉపఖండ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. కార్డిఫ్ వేదికగా మంగళవారం శ్రీలంక- అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. టోర్నీలో బోణీ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి .
తన తొలి మ్యాచ్‌లో శ్రీలంక న్యూజిలాండ్‌పై చిత్తుగా ఓడిపోయింది. కెప్టెన్ కరుణరత్నే మినహా మరెవరూ రాణించలేకపోయారు. శ్రీలంక బౌలర్ల వైఫల్యంతో నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది న్యూజిలాండ్. అన్ని విభాగాల్లో రాణించి అఫ్గాన్ జట్టుపై గెలవాలని లంక ఆశిస్తోంది.
గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది అఫ్గానిస్థాన్. కానీ ఈ రోజు శ్రీలంకపై గెలిచి తానెంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది. రషీద్‌ఖాన్, నబీ, ముజీబుర్ రెహ్మాన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
జట్లు(అంచనా)