తెలంగాణ

telangana

ETV Bharat / sports

తడబడిన సన్​రైజర్స్​- చెన్నైదే విజయం

దుబాయ్​ వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ 20​ పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వార్నర్​ సేనను 147 పరుగులకు కట్టడి చేయగలిగింది చెన్నై. చెన్నై బౌలర్లలో కరణ్​ శర్మ, బ్రావో తలో 2 వికెట్లు పడగొట్టారు.

Chennai Super Kings beat Sunrisers Hyderabad by 20 runs in 29th match of #IPL2020
తడబడిన సన్​రైజర్స్​.. చెన్నైదే విజయం

By

Published : Oct 13, 2020, 11:36 PM IST

ఐపీఎల్​-2020లో ఎట్టకేలకు గెలుపు బాటపట్టింది చెన్నై సూపర్​ కింగ్స్​. దుబాయ్​ వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన పోరులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది ధోనీ సేన.

168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వార్నర్​ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులే చేయగలింది. రెండో ఇన్నింగ్స్​ చివర్లో కేన్​ విలియమ్సన్(57), రషీద్​ ఖాన్​(14)​​ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చెన్నై బౌలర్లలో కరణ్​ శర్మ, బ్రావో తలో 2 వికెట్లు పడగొట్టారు.

తడబడిన వార్నర్​ సేన...

లక్ష్యఛేదనలో సన్​రైజర్స్​ తడబడింది. కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ 9 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్​ పాండే(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేన్​ విలియమ్సన్​తో కలిసి బెయిర్​ స్టో(23).. సన్​రైజర్స్​ను గాడినపెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ కీలక సమయంలో ఔట్​ అయ్యాడు. చివర్లో విలియమ్సన్​ జట్టును గెలిపించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సీఎస్​కే.. నిర్ణీత 20ఓవర్లలో 167 పరుగులు చేసింది. వాట్సన్(42)​, రాయుడు(41) కీలక సమయంలో పరుగులు రాబట్టగా.. చివర్లో ధోనీ(21), జడేజా(25*)ల మెరుపులతో జట్టు స్కోరు 167కు చేరగలిగింది.

ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరింది సీఎస్​కే. మొత్తం మీద 8 మ్యాచ్​లు ఆడిన ధోనీ సేన.. ఇప్పటివరకు మూడు మ్యాచ్​లలో విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details