తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్లో ఓవర్​ రేట్​కు నిషేధం ఉండదు: ఐసీసీ

అంతర్జాతీయ మ్యాచ్​ల్లో ఇకపై స్లో ఓవర్​ రేటు నమోదు చేస్తే కెప్టెన్లకు సస్పెన్సన్ ఉండదని, ఆటగాళ్లందరూ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐసీసీ  స్పష్టం చేసింది.

ఇకపై కెప్టెన్లకు నిషేధం ఉండదు: ఐసీసీ

By

Published : Jul 19, 2019, 3:11 PM IST

ఇకపై అంతర్జాతీయ క్రికెట్​లో స్లో ఓవర్​ రేటు కారణంగా కెప్టెన్​లను సస్పెండ్ చేయడం ఉండదు. సస్పెండ్​ స్థానంలో డాక్ పాయింట్లు లేదా జరిమానా విధిస్తామని నిర్ణయించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). త్వరలో జరిగే యాషెస్ సిరీస్​తో ఇది అమల్లోకి రానుంది.

స్లో ఓవర్​ రేటుకు సంబంధించి క్రికెట్​ కమిటీ ప్రతిపాదించిన అంశాలను ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(2019-2021)​లో ముందుగా అమలు కానుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 1 నుంచి యాషెస్ మొదలుకానుంది.

స్టేడియంలో మ్యాచ్​ జరుగుతున్న దృశ్యం

"అంతర్జాతీయ మ్యాచ్​ల్లో స్లో ఓవర్​ రేటు కారణంగా కెప్టెన్లు ఇకపై నిషేధానికి గురవ్వరు. ఆటగాళ్లందరూ ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. కెప్టెన్​లానే వారికీ జరిమానా విధిస్తారు." -ఐసీసీ

పాత పద్దతి ప్రకారం ఓ ఏడాదిలో రెండు సార్లు అంతర్జాతీయ మ్యాచ్​ల్లో స్లో ఓవర్​ రేటు నమోదు చేస్తే... సంబంధిత జట్టు కెప్టెన్​ నిషేధం ఎదుర్కొవాల్సిందే.

ఈ కొత్త నిబంధనతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని నూతన విధానాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఐసీసీ.

ఇది చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో మాస్టర్ బ్లాస్టర్​

ABOUT THE AUTHOR

...view details